భారత్-ఆస్ట్రేలియా తొలి టీ-20 మ్యాచ్‌ రద్దు

by Muthe.Rajitha |

ఆస్ట్రేలియా, టీమ్‌ ఇండియా మధ్య మొదలైన తొలి టీ-20 మ్యాచ్‌ రద్దయింది.

భారత్-ఆస్ట్రేలియా తొలి టీ-20 మ్యాచ్‌ రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా, టీమ్‌ ఇండియా మధ్య మొదలైన తొలి టీ-20 మ్యాచ్‌ రద్దయింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, టీమ్‌ ఇండియా మధ్య కాన్‌బెర్రా వేదికగా మొదటి మ్యాచ్‌ ప్రారంభం కాగా.. రెండుసార్లు భారీ వర్షం పడటంతో మ్యాచ్ ను రద్దు చేసారు అంపైర్లు. టాస్ గెలిచి ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ కు దిగింది. కాగా 5 ఓవర్ల వద్ద వర్షం పడటంతో మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. వర్షం వెలిసిన అనంతరం మళ్ళీ మ్యాచ్ కొనసాగించగా.. 9వ ఓవర్లో మళ్ళీ వర్షం జోరందుకుంది. వర్షం ఎంతకూ తగ్గకపోవడం, ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంపైర్లు. కాగా మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత జట్టు 9.4 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది.

Next Story