2026 T20 World Cup: పాకిస్తాన్ వ‌ర్సెస్ భార‌త్ మ‌ధ్య రెండు మ్యాచ్ లు ?

by velandi.Saikiran |

టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్, శ్రీలంక రెండు దేశాలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్

2026 T20 World Cup: పాకిస్తాన్ వ‌ర్సెస్ భార‌త్ మ‌ధ్య రెండు మ్యాచ్ లు ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్, శ్రీలంక రెండు దేశాలు సంయుక్తంగా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. దీంతో గ్రూప్ ఏలో పాకిస్తాన్, భారత్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ స్థానం దక్కించుకున్నాయి.

అంటే ఈ లెక్కన గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15, 2026లో ఉంటుంది. అనంతరం ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తే, అక్కడ తలపడే అవకాశాలు ఉన్నాయి. లేదా ఫైనల్స్ లో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ లో ఒకసారి పాల్గొన్నట్లు ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. రెండు జట్లు బాగా ఆడి నాకౌట్ దాకా వెళ్తే, మరోసారి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.

Next Story