ఒమన్‌ను చిత్తు చేసిన భారత యువ జట్టు.. సెమీస్‌కు క్వాలిఫై

by Harish |

ఒమన్‌ను చిత్తు చేసిన భారత యువ జట్టు.. సెమీస్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ‘ఏ’ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఒమన్‌పై నెగ్గడంతో సెమీస్ బెర్త్ దక్కింది. మ్యాచ్‌లో భారత్ ‘ఏ’ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా ఒమన్‌ను 20 ఓవర్లలో మోస్తరు స్కోరు 135/7కే కట్టడి చేసింది. ఆ జట్టులో వసీమ్ అలీ(54 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. హమ్మద్ మిర్జా(32) కూడా రాణించాడు. భారత్ ‘ఏ’ బౌలర్లు గుర్జప్నీత్, సూయశ్ శర్మ చెరో 2 వికెట్లతో చెలరేగారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ ‘ఏ’ జట్టు అలవోకగా ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసి విజయం సాధించింది. హర్ష్ దూబె(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. నమన్ ధిర్(30), నేహాల్(23) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

Next Story