- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి అనధికార టెస్టు డ్రా
భారత్ ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన తొలి అనధికార టెస్టు సోమవారం డ్రాగా ముగిసింది.

దిశ, స్పోర్ట్స్ : భారత్ ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన తొలి అనధికార టెస్టు సోమవారం డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏ 557 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతే ధీటుగా బదులిచ్చిన ఇంగ్లాండ్ లయన్స్ 587 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 527/7తో ఆట కొనసాగించిన ఆ జట్టు మరో 60 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి 30 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత భారత్ ఏ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. యశస్వి జైశ్వాల్(64), అభిమన్యు ఈశ్వరన్(68) హాఫ్ సెంచరీలు చేసి అవుటయ్యారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 123 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జతచేసింది. అనంతరం ధ్రువ్ జురెల్(53 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి(52 నాటౌట్) కూడా అర్ధ శతకాలతో సత్తాచాటాడు. అయితే, ఆటలో సోమవారమే చివరి రోజు కావడం, ఫలితం తేలే చాన్స్ లేకపోవడంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు. అప్పటికీ భారత్ ఏ 2 వికెట్లే కోల్పోయి 241 రన్స్ చేసింది. ఈ నెల 6 నుంచి 9 వరకు రెండో అనధికార టెస్టు జరగనుంది.






