- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఇండియా ఏ జట్టు ప్రకటన
ఈ నెల 14 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 14 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ ఇండియా ఏ జట్టును ఎంపిక చేసింది. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుండి 23 వరకు దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒమన్, యుఎఇ, పాకిస్తాన్ ఎతో పాటు ఇండియా ఎ గ్రూప్ బిలో ఉన్నాయి. అంటే ఈ టోర్నీలో మరో భారత, పాకిస్తాన్ మ్యాచ్ అనివార్యం అయింది. నవంబర్ 16న భారత జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఇండియా ఏ జట్టు
ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధీర్ (విసి), సూర్యాంష్ షెడ్జ్, జితేష్ శర్మ (సి) (వికె), రమణ్‌దీప్ సింగ్, హర్ష్ దుబే, అశుతోష్ శర్మ, యష్ ఠాకూర్, గుర్జర్ నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశక్, యుధ్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికె), సుయాష్ శర్మ.
స్టాండ్-బై ప్లేయర్స్: గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుషాగ్ర, తనుష్ కోటియన్, సమీర్ రిజ్వి, షేక్ రషీద్.






