సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ సేన ఢీ.. వచ్చే నెలలో ఇండియాలో మల్టీ ఫార్మాట్ సిరీస్

by Harish |

భారత్, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ఇండియా ఆతిథ్యమివ్వనుంది.

సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ సేన ఢీ.. వచ్చే నెలలో ఇండియాలో మల్టీ ఫార్మాట్ సిరీస్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ఇండియా ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో సౌతాఫ్రికా మహిళల జట్టు ఇండియాకు రానుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం రిలీజ్ చేసింది. మొదట వన్డే మ్యాచ్‌లకు బెంగళూరు వేదిక కానుంది. జూన్ 16, 19, 23 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. 2022-25 ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డే సిరీస్‌కు ముందు జూన్ 13న సౌతాఫ్రికా జట్టు బోర్డు ప్రెసిడెంట్స్ టీమ్‌తో వన్డే వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఏకైక టెస్టు మ్యాచ్‌కు చెన్నయ్ ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో భాగంగా జూలై 5, 7, 9 తేదీల్లో చెన్నయ్ వేదికగానే టీ20‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై కూడా అదే జోరును కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తున్నది.

Next Story