- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల ప్రపంచకప్‌లో మరో మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు.. భారత్, బంగ్లా ఆట రద్దు
మహిళల ప్రపంచకప్‌కు వరుణుడు అడ్డుగా మారాడు. మరో మ్యాచ్‌పై నీళ్లు చల్లాడు.

దిశ, స్పోర్ట్స్ : మహిళల ప్రపంచకప్‌కు వరుణుడు అడ్డుగా మారాడు. మరో మ్యాచ్‌పై నీళ్లు చల్లాడు. నవీ ముంబైలో ఆదివారం జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణమైంది. పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం ఆట రద్దయ్యే వరకూ విడిచిపెట్టలేదు. టాస్ పడకముందే వర్షం పడింది. టాస్ పడిన తర్వాత కూడా వర్షం రావడంతో దాదాపు గంట తర్వాత మ్యాచ్ మొదలైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ముందుగా బంగ్లా బ్యాటింగ్ చేయగా ఇన్నింగ్స్ మధ్యలో మరోసారి వాన పడింది. దీంతో 27 ఓవర్లకు తగ్గించారు. 27 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. భారత బౌలర్లు రాధ యాదవ్ 3 వికెట్లు, శ్రీచరణి 2 వికెట్లతో సత్తాచాటి ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. ఇక ఆట సాగుతుందేమో అనుకుంటే భారత్ చేజింగ్ ప్రారంభించిన కాసేపటికే మళ్లీ వర్షం పడింది. అప్పటికి భారత్ 8.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. స్మృతి మంధాన(34 నాటౌట్), అమన్‌జోత్ కౌర్(15 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దైనట్టు ప్రకటించారు. ప్రపంచకప్‌లో వర్షం కారణంగా ఫలితం తేలని 6వ మ్యాచ్ ఇది. భారత్, బంగ్లా మ్యాచ్‌తో గ్రూపు దశ ముగిసింది. ఈ నెల 29, 30 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు, రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా టీమ్‌లు ఎదురుపడనున్నాయి.






