- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND-W vs AUS-W : మూడో వన్డేలో భారత్ పోరాటం వృథా.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియా మహిళలదే
వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది.

దిశ, స్పోర్ట్స్ : వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీలో శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 43 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. దీంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టుకు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. బెత్ మూనీ(138) శతకంతో రెచ్చిపోగా.. జార్జియా వాల్(81), ఎల్లీస్ పెర్రీ(68) కూడా సత్తాచాటారు. భారత బౌలర్లలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 3 వికెట్లు, రేణుక సింగ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా పోరాడింది. రెండో వన్డేలో శతకంతో జట్టును గెలిపించిన స్మృతి మంధాన మరోసారి అదరగొట్టింది. వరుసగా రెండో సెంచరీని నమోదు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆమె 63 బంతుల్లో 125 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(52) కూడా రాణించింది. హర్మన్‌ప్రీత్‌తో కలిసి స్మృతి స్కోరును 200 దాటించింది. అయితే, వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో భారత్ కష్టాల్లో పడేలా కనిపించింది. కానీ, దీప్తి శర్మ(72) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆమె మాత్రం సంచలన పోరాటంతో జట్టును లక్ష్యం దిశగా నడిపించింది. అయితే మెక్‌గ్రాంత్ బౌలింగ్‌లో దీప్తి అవుటవడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి. స్వల్ప వ్యవధిలోనే మిగతా రెండు వికెట్లు కోల్పోయివడంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియాకు భారత్‌పై ఇది 11వ వన్డే సిరీస్ విజయం. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై భారత్ వన్డే సిరీస్ సిరీస్ గెలవలేదు.






