IND Vs WI: రెండో రోజు ముగిసిన ఆట.. రవీంద్ర జడేజా మాయాజాలం

by Kema Shiva Kumar |

ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌ (West Indies)తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ (India) పట్టు బిగించింది.

IND Vs WI: రెండో రోజు ముగిసిన ఆట.. రవీంద్ర జడేజా మాయాజాలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌ (West Indies)తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ (India) పట్టు బిగించింది. భారత్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (Shubhman Gill) 196 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లూ అంతా రాణించడంతో రెండో రోజు రెండో సెషన్‌లోపే భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. యశస్వీ జైస్వాల్ (175), సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌ రెడ్డి (43) రాణించారు. వారికన్‌ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.

విండీస్‌ను దెబ్బకొట్టిన జడేజా..

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు తంగెనరైన్ చందర్‌పాల్, జాన్ క్యాంబెల్ క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా క్యాంబెల్, బుమ్రా, సిరాజ్ వేసే ఇన్, అవుట్ స్వింగర్లతో సతమతమయ్యాడు. ఈ క్రమంలోనే జాన్ క్యాంబెల్ 25 బంతుల్లో 10 పరుగులు చేసి 7 ఓవర్‌లో వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. అనంతరం మరో ఓపెనర్ తంగెనరైన్ చందర్‌పాల్ 67 బంతుల్లో 34 పరుగులు చేసిన జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అలిక్ అథనాజ్, షాయ్ హోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే అలిక్ అథనాజ్ 84 బంతుల్లో 41 పరుగులు చేసిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ రాస్టన్ చేజ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. రెండు రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్ 4 కీలక వికెట్లు కోల్పోయి 140 పరుగుల చేసింది. షాయ్ హోప్ 46 బంతుల్లో 31 పరుగులు, టెవిన్ ఇమ్లాచ్ 31 బంతుల్లో 14 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

Next Story