- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs WI Test: తొలి టెస్టులో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచులో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు (First test)లో భారత్ ఘన విజయం (Great win for India) సాధించింది. ఈ నెల 2న ప్రారంభం అయిన ఈ మొదటి టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలు చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. అనంతరం మూడో రోజు ఆటను ప్రారంభించకముందే భారత్ డిక్లేర్ చేసింది. 286 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అలాగే ఫీల్డర్లు సైతం మంచి ప్రదర్శన ఇవ్వడంతో రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో సిరజ్ 3, జడేజా 4, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీసుకున్నారు.






