- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs SA: పోరాడుతున్న వాషింగ్టన్ సుందర్.. పొంచి ఉన్న ఫాలోఆన్ గండం
సౌతాఫ్రికాతో జరుగుతోన్న గౌహతి టెస్ట్‌లో భారత జట్టు లంచ్ ముగిశాక 7 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతున్న గౌహతి టెస్ట్‌లో భారత జట్టు లంచ్ ముగిశాక 7 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. ఇంకా 297 పరుగుల వెనకంజలో ఉంది. అయితే, ఫాలోఆన్ గండాన్ని తప్పించుకోవాలంటే మరో 96 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 46, కుల్‌దీప్ యాదవ్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ 8వ వికెట్‌కు 200 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగులు చేసింది. భారత్ 9/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ధాటిగా ఆడిన భారత్ టీ విరామ సమయం తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ 97 బంతుల్లో 58 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ 4, సైమన్ హర్మర్ 2, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీసుకున్నారు.






