- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS SA: పాపం..సంజుకు ప్రకృతి కూడా సహకరించలేదు!
సంజు శాంసన్ తో గౌతమ్ గంభీర్ విపరీతంగా చర్చలు చేశాడు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందు అతనితో బ్యాటింగ్

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లక్నో వేదికగా నిన్న జరగాల్సిన టీ20 రద్దయిన సంగతి తెలిసిందే. పొగ మంచు కారణంగా మ్యాచ్ రద్దు చేస్తూ, బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ప్రకటన చేశారు అంపైర్లు. అయితే పొగ మంచు సంజు శాంసన్ కు విలన్ గా మారిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. నిన్న జరగాల్సిన నాలుగవ టి20 మ్యాచ్ లో కాలి గాయం కారణంగా గిల్ ఆడబోడని ముందస్తుగా ప్రచారం సాగింది.
దీనికి తగ్గట్టుగానే సంజు శాంసన్ తో గౌతమ్ గంభీర్ విపరీతంగా చర్చలు చేశాడు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందు అతనితో బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయించాడు. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో కచ్చితంగా సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని అందరూ అంచనా వేశారు. కానీ ప్రకృతి వెక్కిరించింది. సంజు శాంసన్ ఎంట్రీని అడ్డుకుంది. పొగ మంచు కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దు అయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సంజు శాంసన్ అభిమానులు పేర్కొంటూ బాధపడుతున్నారు. కాగా రేపు 5వ టీ20 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగనుంది. ఆ లోపే గిల్ కోలుకోకపోతే, సంజు ఎంట్రీ ఎవరూ ఆపలేరని అంటున్నారు.






