ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డేలు..ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌-కోహ్లీ?

by velandi.Saikiran |

దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా ( India vs South Africa) మధ్య వన్డే సిరీస్ ( ODI Series ) ఆదివారం

ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డేలు..ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌-కోహ్లీ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా ( India vs South Africa) మధ్య వన్డే సిరీస్ ( ODI Series ) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత్, ఈ వన్డే సిరీస్ ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తోంది. దానికి తోడు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ సీరీస్ కు అందుబాటులోకి రానున్నారు. మొదటి వన్డే రాంచీ వేదికగా జరగనుంది. ఈ తరుణంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ నెట్స్ లో బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. మూడు రోజుల కిందటే రాంచీకి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తూ చెమటోడ్చుతున్నారు.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ -విరాట్ కోహ్లీ ?

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గిల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. దీంతో పూర్తి బాధ్యత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పైన పడింది. అటు రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అతడికి తోడుగా ఎవరు వస్తారు ? అన్నది ఇప్పుడు చర్చ. యశస్వి జైస్వాల్ మరో ఓపెనర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

కానీ అభిమానులు మాత్రం, ఈ ఒక్క సిరీస్ తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనర్లుగా దిగాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఓపెనర్లుగా దిగితే, చూడాలని ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే అది సాధ్యపడదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అంటున్నారు. కోహ్లీ ఫ‌స్ట్ వికెట్ కు వ‌స్తాడ‌ని అంటున్నారు. కాగా దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ వ‌న్డే సిరీస్ నేప‌థ్యంలో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కు ( KL Rahul) అవ‌కాశం ఇచ్చారు.

Next Story