- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్..ఈ‘డెన్’లో టీమిండియానే రారాజు
దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా

దిశ, వెబ్ డెస్క్: భారత్ మరో సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియా గడ్డపై మొన్నటి వరకు వన్డే, టీ20లు ఆడిన భారత్.. ఇప్పుడు టెస్ట్ సంబరానికి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ తొలి టెస్ట్ జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ టెస్ట్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.
దీంతో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇలాంటి ముగ్గురు తోపు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది భారత్. అంతేకాదు ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఈ ఈడెన్ గార్డెన్స్ లో ఇప్పటి వరకు 42 మ్యాచ్ లు ఆడింది భారత్. ఇందులో 13 గెలిచి, 20 మ్యాచ్ లు డ్రా చేసుకుంది. 9 మ్యాచ్ లలో ఓడింది. చివరగా బంగ్లాదేశ్ పైన 2019లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దక్షిణాఫ్రికాపై కూడా భారత్ రాణిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ టెస్ట్ సిరీస్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.






