- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs SA: విజృంభించిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా స్కోర్ ఇదే
కోల్‌కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు విజృంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల దెబ్బకు తొలి రోజు టీ విరామ సమయానికి ప్రత్యర్థి జట్టు 154 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, అంతుకు ముందు టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మార్కరమ్ 48 బంతుల్లో 31, ర్యాన్ రాకిల్టన్ 22 బంతుల్లో 23 పరుగులతో చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. భారత్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి ఓపెనర్లు ఎక్కువ సేపు నిలువలేక పోయారు. వచ్చినవారు వచ్చినట్లుగా కాసేపు క్రీజ్‌లో ఉండి పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.






