- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సాధారణంగా టెస్టు మ్యాచ్ ఒక రోజు 90 ఓవర్లపాటు మూడు సెషన్లలో జరుగుతుంది. భారత్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌లో తొలి సెషన్ ముగియగానే లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత రెండో సెషన్ తర్వాత టీ బ్రేక్.. మూడో సెషన్ ముగిస్తే ఆ రోజు ఆట పూర్తయినట్టు. కానీ, భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వచ్చే నెలలో జరగబోయే రెండో టెస్టు ఇందుకు భిన్నంగా జరగనుంది. ఈ గువహతి వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా తొలి సెషన్ తర్వాత లంచ్ బ్రేక్ కాకుండా టీ బ్రేక్ ఇస్తారు. సెకండ్ సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. అలాగే, సాధారణంగా భారత్‌లో టెస్టు మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుండగా ఈ మ్యాచ్ మాత్రం అరగంట ముందుగానే అంటే 9:00 గంటలకు మొదలుకానుంది. తొలి సెషన్ 9 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ 11:20 గంటల నుంచి 1:20 గంటల వరకు, ఇక మూడో సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటాయి.
అస్సోంలో ఉండే వాతావరణమే ఈ మార్పులకు కారణం. అసోంలో త్వరగా సూర్యోదయం, సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. పగటి వెలుతురిని సద్వినియోగం చేసుకోవడానికి, త్వరగా సూర్యాస్తమయం కారణంగా ఆట సమయాన్ని కోల్పోకుండా ఉండటానికి టీ, లంచ్ విరామాలను మర్చినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత క్రికెట్‌లో ఓ టెస్టు మ్యాచ్‌లో ఇలా చేయడం ఇదే తొలిసారి. గువహతిలోని బర్సపారా స్టేడియంలో ఓ టెస్టు మ్యాచ్‌కు తొలిసారిగా ఆతిథ్యమిస్తున్నది. తొలి టెస్టు కోల్‌కతాలో నవంబర్ 14 నుంచి జరగనుంది.
- Tags
- IND vs SA






