- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుమ్ములేపిన టీమిండియా బౌలర్లు...పాక్ ఆలౌట్...టార్గెట్ ఎంతంటే
19.1 ఓవర్లు ఆడిన పాకిస్తాన్... 146 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ కుప్ప కూలింది. 200కు పైగా పరుగులు చేస్తారనుకుంటే.. 150 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసింది పాకిస్తాన్. టీమిండియా బౌల్లర్స్ అద్భుతంగా రాణించడంతో.. పాకిస్తాన్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఈ నేపథ్యంలోనే 19.1 ఓవర్లు ఆడిన పాకిస్తాన్... 146 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
ఓపెనర్ ఫర్హాన్ అలాగే ఫఖర్ జమాన్ ఇద్దరు రాణించగా... మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. ఇందులో ఫర్హాన్ 57 పరుగులు చేయగా...ఫఖర్ జమాన్ 46 పరుగులు చేసి రాణించారు. అటు టీమ్ ఇండియా బౌలర్లలో... కుల్దీప్ యాదవ్ మరోసారి రెచ్చిపోయి నాలుగు వికెట్ తీశాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేస్తే టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొడుతుంది.






