ర‌వీంద్ర‌ జ‌డేజాపై ట్రోల్స్..రిటైర్మెంట్ ఇవ్వాలంటూ !

by velandi.Saikiran |

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన 3 వ‌న్డేల‌ సిరీస్ లో కూడా రవీంద్ర జడేజా అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచాడు.

ర‌వీంద్ర‌ జ‌డేజాపై ట్రోల్స్..రిటైర్మెంట్ ఇవ్వాలంటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజాపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు భారత జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. అలాంటి రవీంద్ర జడేజా ఇప్పుడు అన్ని విభాగాల్లో విఫలమవుతున్నాడు. కచ్చితంగా మ్యాచ్ లో మూడు నుంచి నాలుగు వికెట్లు తీసేవాడు. కానీ ఇప్పుడు అలాంటి ఊపు జడేజాలో కనిపించడం లేదు. అటు బ్యాటింగ్ లో అందరూ వికెట్లు సమర్పించుకున్నా, జడేజా మాత్రం అర్థ సెంచరీ చేసే వరకు నిద్రపోయేవాడు కాదు. అలాంటిది రవీంద్ర జడేజా, వన్డేలలో అర్థ సెంచరీ చేసి ఏడాది కాలమైంది.

న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో కూడా జడేజా విఫలం

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన 3 వ‌న్డేల‌ సిరీస్ లో కూడా రవీంద్ర జడేజా అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్ ల‌లో కూడా రవీంద్ర జడేజా ఆడాడు. ఇందులో 23 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అటు మూడు మ్యాచ్ ల‌లో 42 పరుగులు మాత్రమే సాధించాడు. నిన్న విరాట్ కోహ్లీతో సరిగ్గా ఆడి మ్యాచ్ గెలిపిస్తాడని అందరు అనుకున్నారు. అక్కడ కూడా భారత్ ను నట్టేట ముంచేశాడు జడేజా. దీంతో వన్డేలో కూడా జడేజా రిటైర్మెంట్ తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే టీ20 లకు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా న్యూజిలాండ్ చేతిలో అప్ప‌ట్లో టెస్ట్ సిరీస్ కోల్పోయిన భార‌త్‌, నిన్న వ‌న్డే సిరీస్ కూడా కోల్పోయింది.

Next Story