IND Vs NZ: ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో మ్యాచ్‌కు కీలక పేసర్ దూరం

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-09 09:18:55  IST  )

దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) ఫైనల్ మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది.

IND Vs NZ: ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో మ్యాచ్‌కు కీలక పేసర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) ఫైనల్ మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ (Team India) జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతోంది.

ఫైనల్‌‌లో కివీస్‌ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్, గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌పై 5 వికెట్లు తీసిన మ్యాట్ హెన్రీ (Matt Henry) గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం అయ్యాడు. రెండో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా (South Africa)తో మ్యాచ్‌లో అతడు ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో భుజం నొప్పి కారణంగా ప్రాక్టీస్‌ సెషన్ (Practice Session)లోనూ ఎక్కువగా పాల్గొనలేదు. ఈ క్రమంలోనే ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఇవాళ్టి మ్యాచ్‌కు మ్యాట్ హెన్రీ (Matt Henry) స్థానంలో మరో పేసర్ నాథన్ స్మిత్‌ (Nathan Smith)‌ను తుది జట్టులోకి తీసుకుంది.

Next Story