- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs NZ: రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. సోషల్ మీడియాలో జోరుగా ప్రెడిక్షన్లు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) ఫైనల్ సమరానికి మరికొద్ది గంటల్లోనే తెర లేవనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) ఫైనల్ సమరానికి మరికొద్ది గంటల్లోనే తెర లేవనుంది. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా భారత జట్టు (India), న్యూజిలాండ్ (New Zealand)జట్టుతో తలపడబోతోంది. కప్పు సాధించడమే లక్ష్యంగా ఇరు జట్లు భీకర పోరుకు సై అంటున్నాయి. ఇక జట్ల విషాయానికి వస్తే టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), విరాట్ కోహ్లీ (Virat Kohli), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), కేఎల్ రాహుల్ (KL Rahul)లు ఫామ్‌లో ఉంటడం టీమ్‌కు కలిసొచ్చే అంశం. అటు బౌలింగ్ విభాగంలోనూ మహమ్మద్ షమీ (Mohammed Shami) ఆరంభంలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇక మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తన స్పిన్ మాయాజాలంతో కీలక ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తున్నాడు.
ఇక ప్రత్యర్థి న్యూజిలాండ్ (New Zealand) జట్టులో రచిన్ రవీంద్ర (Rachin Ravindra), కేన్ విలియమ్సన్ (Kane Williamson) చివరి మ్యాచ్‌లో సెంచరీలతో అదరగొట్టారు. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లు గ్రౌండ్‌లో పాదరసంలో కదులుతూ ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను సింగిల్స్, డబుల్స్ తీయనివ్వకుండా రనౌట్లు చేస్తున్నారు. ఆ జట్లు పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.
విజేత ఏవరో చెప్పేసిన ‘ఏఐ’ చాట్‌బోట్స్, గూగుల్ జెమిని..
అయితే, ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై సోషల్ మీడియా (Social Media)లో ప్రెడిక్షన్లు తారా స్థాయికి చేరాయి. రేపటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని AI చార్ట్‌బోట్స్ (AI Chatbots)ను ప్రశ్నించగా.. భారత జట్టే విజయం సాధిస్తుందని చెప్పింది. ఇక ‘గూగుల్ జెమిని’ (Google Gemini) ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ ఉన్నా.. ఎడ్జ్ మాత్రం టీమిండియా (Team India)కే ఉంటుందని తేల్చేసింది. అదేవిధంగా ఓపెన్ AI (Open AI), చాట్ GPT, మైక్రోసాఫ్ట్ కాపిలాట్ (Microsoft Copilot) భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోబోతోందని చెప్పాయి.






