- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND Vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరం.. టీమిండియా తుది జట్టు ఇదే!
మరికొద్ది గంటల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) ఫైనల్ సమరానికి తేర లేవనుంది.

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది గంటల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) ఫైనల్ సమరానికి తేర లేవనుంది. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ ఇంటర్‌నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు పకడ్బందీగా ప్రాక్టీస్ చేశాయి. ఈ క్రమంలోనే భారత జట్టు (Team India) ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటిలాగే రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)తో కలిసి ఇన్సింగ్స్‌ను ఆరంభించనున్నారు.
ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన కింగ్ కోహ్లీ తుది జట్టులో ఆడతాడని జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే ప్రకటించింది. మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యార్ (Shreyas Iyer), కేఎల్ రాహుల్ (KL Rahul) వారికి కేటాయించిస స్థానాల్లోనే బ్యాటింగ్‌కు రానున్నారు. మరోసారి రిషభ్ పంత్ (Rishabh Pant)కు జట్టులో చోటు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను పక్కన పెడితే అతడి స్థానంలో మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) జట్టులోకి రానున్నారు. సుందర్ ఇటు బౌలింగ్‌లో.. బ్యాటింగ్‌లోనూ సత్తా చూపుతాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తోంది. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి స్థానానికి ఢోకా లేదు. ఇప్పటికే అతడు న్యూజిలాండ్ (New Zealand) జట్టుపై 5 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.
భారత జట్టు అంచనా..
రోహిత్ శర్మ (కెప్టెన్) శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.






