- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూజిలాండ్ తో అమీ తుమీ..రంగంలోకి కొత్త కుర్రాడు !
రవీంద్ర జడేజా పేలవమైన ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిపోయాడు. అందుకే అతన్ని మూడో వన్డే నుంచి తప్పించే ఛాన్స్ ఉందట.

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు మూడవ వన్డే జరగనుంది. ఇండోర్ వేదికగా వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి వన్డేలో భారత్ గెలవగా, రెండవ వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ కీలక మార్పుతో బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. రవీంద్ర జడేజా కు రెస్ట్ ఇచ్చి, కొత్తగా వచ్చిన ఆయుష్ బడోనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొన్ని రోజులుగా రవీంద్ర జడేజా పేలవమైన ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిపోయాడు. అందుకే అతన్ని మూడో వన్డే నుంచి తప్పించే ఛాన్స్ ఉందట. అచ్చం రవీంద్ర జడేజా లాగానే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సత్తా ఆయుష్ బడోనికి ఉంది. అందుకే అతన్ని తీసుకుంటున్నారట. ఇక అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాస్త క్లిక్ అయితే మనోళ్లు మ్యాచ్ గెలవడం ఈజీ అంటున్నారు. ఇదే జరిగితే 2-1 తేడాతో సిరీస్ భారత వశం అవుతుంది.






