- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS NED: గ్రూప్-ఏలో లాస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
టీ20 వరల్డ్ కప్-2026లో భాగంగా ఇవాళ భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో సూపర్-8కు చేరిన టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తమ అజేయ యాత్రను కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men's T20 World Cup-2026)లో భాగంగా ఇవాళ గ్రూప్-ఏలో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ (India), నెదర్లాండ్స్ (Netherlands) జట్లు తలపడుతున్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వరుస విజయాలతో సూపర్-8కు చేరిన భారత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది.
ఇక టోర్నీలో భారత్ అజేయంగా దూసుకుపోతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌పై 61 పరుగులు, నమీబియాపై 93 పరుగులు, అమెరికా జట్టుపై 29 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇక జట్టులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తుండగా.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. నెదర్లాండ్స్ జట్టులో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, బాస్ డి లీడే భారత్‌కు సవాల్ విసిరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేశారు. అక్షర పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు.






