- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs NAM: సిక్సర్లతో ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా భారత్
సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జోరును కొనసాగిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జోరును కొనసాగిస్తోంది. గ్రూప్-Aలో భాగంగా ఇవాళ నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కాగా, అంతకు ముందుకు టాస్ గెలిచిన నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అనారోగ్యం కారణంగా అభిషేక్ శర్మ దూరం కావడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రాగా, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కు పరిమితమయ్యాడు.
ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షం..
తొలి ఓవర్ నుంచే భారత బ్యాటర్లు ఇన్సింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ 13 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా జేజే స్మిత్ వేసిన 6వ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి 2 కీలక వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. తిలక్ వర్మ (21) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.






