IND Vs ENG: నేడు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే.. భారీ రికార్డుకు చేరువలో రోహిత్

by Shiva |   ( Updated:2025-02-12 03:47:05.0  )
IND Vs ENG: నేడు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే.. భారీ రికార్డుకు చేరువలో రోహిత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌ (England)తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా (Team India) 2-0తో కైవ‌సం చేసుకుంది. ఇక నామ‌మాత్రమైన మూడో వ‌న్డే బుధ‌వారం గుజ‌రాత్‌ (Gujrat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Staduim)లో జరగనుంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ (Champions Trophy)కి ముందు భార‌త్‌ (India), ఇంగ్లాండ్ (England) జ‌ట్లు ఆడుతున్న చివ‌రి వన్డే మ్యాచ్ ఇదే కావడం విశేషం. చివరి వన్డేలో ఎలాగైనా విజయం సాధించి ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆత్మవిశ్వాసం అడుగుపెట్టాలని భారత జట్టు.. మరోవైపు ఒక్క మ్యాచ్‌లో అయిన గెలుపొంది పరువు నిలుపుకోవాలని ఇంగ్లీష్ జట్టు చూస్తోంది.

ఈ క్రమంలోనే భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma)ను ఓ భారీ రికార్డుకు చేరువయ్యాడు. వన్డేల్లో రోహిత్ మరో 13 పరుగులు సాధిస్తే ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా కొత్త రికార్డును నెలకొల్పనున్నాడు. ఈ జాబితాలో లిటిల్ మాస్టర్ సచిన్ (276 ఇన్నింగ్స్‌లో), సౌరభ్ గంగూలీ (288 ఇన్నింగ్స్‌లో), జాక్వెస్ కలిస్ (293 ఇన్నింగ్స్‌లో), రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్‌లో) కన్నా వేగంగా 11 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ నిలవనున్నాడు.

ఇప్పటికే ఈ వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 222 ఇన్నింగ్స్‌ల్లోనే 11 వేల పరుగుల మార్క్‌ను దాటాడు. రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లో ఇప్పటి వరకు 10,987 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డేలో హిట్ మ్యాన్ దానిని సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటీవల జరిగిన రెండో వన్డేలో అతడు శతకం చేసి మళ్లీ ఫామ్‌‌లోకి వచ్చేశాడు. అదేవిధంగా ఒకవేళ మూడో వన్డేలో రోహిత్ మరో సెంచరీ చేస్తే.. భారత తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లో 50 సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు.

Advertisement
Next Story