- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs ENG: తడబడుతోన్న టీమిండియా.. మూడు కీలక వికెట్లు డౌన్
మాంచెస్టర్ (Manchester)లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా (Team India) తడబడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మాంచెస్టర్ (Manchester)లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా (Team India) తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఫస్ట్ సెషన్‌లో వికెట్లు ఏమీ కోల్పోకుండా 78 పరుగులు చేసింది. అనంతరం సెకండ్ సెషన్‌లో టీ విరామ సమయానికి వెంటవెంటనే మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 107 బంతుల్లో 58 పరుగులు, హాఫ్ సెంచరీ చేసి డాసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 98 బంతుల్లో 46 పరుగులు చేసి క్రిస్ వోక్స్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లో కలిసి భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించారు. కానీ, అనూహ్యంగా గిల్ 23 బంతుల్లో 12 పరుగులు చేసి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 కీలక వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 37 బంతుల్లో 35 పరుగులు, కీపర్ రిషభ్ పంత్ 19 బంతుల్లో 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ నేలకూల్చారు. కీలక బ్యాట్స్‌మెన్లు ఇప్పటికే పెవీలియన్ చేరడంతో.. భారీ స్కోర్ సాధించాలంటే క్రీజ్‌లో ఉన్న సాయి సుదర్శన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలపై జట్టు ఆశలు పెట్టుకుంది.






