IND Vs ENG: అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన భారత్

by Kema Shiva Kumar |

కౌలాలంపూర్ (Kuala Lumpur) వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌ (Under-19 Women's T20 World Cup)లో సంచలన చోటుచేసుకుంది.

IND Vs ENG: అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: కౌలాలంపూర్ (Kuala Lumpur) వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌ (Under-19 Women's T20 World Cup)లో సంచలన చోటుచేసుకుంది. సెమీస్‌లో ఇంగ్లాండ్ (England) జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ (India) ఫైనల్‌లో దర్జాగా అడుగుపెట్టింది. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ (England) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ జట్టు (English Team) టాపార్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఆ జట్టులో డేవినా పెర్రిన్ (40), కెప్టెన్ అబి నార్గ్రోవ్ (30) తప్పా మిగతా బ్యాట్స్‌మెన్లు అంతి సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. దీంతో ఆ జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (Vaishnavi Sharma) 3, పరునికా సిసోడియా (Parunika Sisodia) 3, ఆయుషి (Ayushi) 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా (Team India) బ్యాట్స్‌మెన్లు ఇంగ్లాండ్ (England) బౌలర్లకు చుక్కు చూపించారు. ఓపెనర్లు కమలిని (Kamalini) 50 బంతుల్లో 56 పరుగులు, సనిక చల్కే 12 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష (Gongidi Trisha) మరోసారి అద్భుతంగా ఆడింది. 29 బంతుల్లో 35 పరుగులు చేసి బ్రెట్ (Brett) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఈ కప్‌లో వరుస విజయాలను సాధించిన భారత యువ జట్టు ఇంగ్లాంగ్‌ (England)పై గెలిచి ఫైనల్‌లో సౌతాఫ్రికా (South Africa)తో తలపడనుంది. తొలి సెమీ ఫైనల్‌-1 (Semi Final-1)లో ఆస్ట్రేలియా (Australia)పై సౌతాఫ్రికా (South Africa) విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్ మ్యాచ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య బయుమాస్ ఓవల్ వేదికగా ఫిబ్రవరి 2న జరగనుంది.

Next Story