- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs ENG: నిలకడగా ఆడుతున్న రోహిత్, కోహ్లీ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుట్
భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా (Team India) ఆచితూచి ఆడుతోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయినప్పటికీ, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli)లు బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
వరుస ఫోర్లతో గిల్ దూకుడు.. క్యాచ్ అవుట్
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 4 ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించాడు. అయితే, 31 పరుగుల (30 బంతులు, 6 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద గుస్ అట్కిన్సన్ (Gus Atkinson) బౌలింగ్‌లో బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అదృష్టం కలిసివచ్చింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లాండ్ ఫీల్డర్ చేజార్చాడు. ఇక గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 19, విరాట్ కోహ్లీ 17 పరుగులతో క్రీజులో నిలకడగా ఆడుతున్నారు.






