IND Vs ENG: రిషభ్ పంత్‌కు గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన సాయి సుదర్శన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-24 02:27:02  IST  )

మాంచెస్టర్‌ (Manchester)లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) స్డేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్ట్‌లో తొలిరోజు కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు.

IND Vs ENG: రిషభ్ పంత్‌కు గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన సాయి సుదర్శన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాంచెస్టర్‌ (Manchester)లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) స్డేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్ట్‌లో తొలిరోజు కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. క్రిస్ వోక్స్ వేసిన 68వ ఓవర్‌ నాలుగో బంతికి రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్‌కు కుడి పాదం చివరన తీవ్ర గాయమైంది. కాలు వాయడంతో పాటు రక్తస్రావం కూడా జరిగింది. దీంతో రిషభ్ పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. గ్రౌండ్ స్టాఫ్ అంబులెన్స్‌లో అతడిని గ్రౌండ్ నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించారు. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషభ్ పంత్ స్థానంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బ్యాటింగ్‌కు వచ్చాడు.

ఈ నేపథ్యంలోనే టీమిండియా బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) మాట్లాడుతూ.. పంత్‌కు గాయమైనప్పుడు తాను మరో ఎండ్‌లో ఉన్నానని తెలిపాడు. నిజంగా అతడు ఆ నొప్పికి విలవిలలాడిపోయాడని పేర్కొన్నాడు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు అతడిని స్కానింగ్‌కు తీసుకెళ్లారని.. రిపోర్టు వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయని అన్నాడు. పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. అతడు బ్యాటింగ్‌కు రాకపోయినా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటామని తెలిపారు. మరో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారని సాయి సుదర్శన్ వెల్లడించారు.

Next Story