IND Vs ENG: చెలరేగిన మహమ్మద్ సిరాజ్.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?

by Kema Shiva Kumar |

IND Vs ENG: చెలరేగిన మహమ్మద్ సిరాజ్.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?

IND Vs ENG: చెలరేగిన మహమ్మద్ సిరాజ్.. టీమిండియా ఆధిక్యం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ (England) తొలి ఇన్సింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్‌మెన్లలో జామీ స్మిత్‌ (207 బంతుల్లో 184 పరుగులు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదేవిధంగా హ్యారీ బ్రూక్ (Harry Brook) 234 బంతుల్లో 158 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 6 వికెట్లు, మరో పేసర్ ఆకాశ్ దీప్ (Aakash Deep) 4 వికెట్లను పడగొట్టారు. అనంతరం సెకండ్ ఇన్సింగ్స్‌లో భాగంగా బరిలోకి దిగిన భారత జట్టు వికెట్లు ఏమి కోల్పోకుండా 10 పరుగులు చేసి 190 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వీ జైస్వాల్ (5), కేఎల్ రాహుల్ (5) పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

Next Story