లంచ్ బ్రేక్... మరో 4 వికెట్లు తీస్తే టీమిండియా విక్టరీ ఖాయం

by velandi.Saikiran |   (  Updated:2025-07-06 15:01:41  IST  )

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ చివరి రోజు

లంచ్ బ్రేక్... మరో 4 వికెట్లు తీస్తే టీమిండియా విక్టరీ ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో... గెలుపు కోసం టీమిండియా బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. నిన్న మూడు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. ఇవాళ మరో ముగ్గురిని ఔట్ చేశారు. దీంతో 40 ఓవర్లు ఆడిన... ఇంగ్లాండ్... 6 వికెట్లు నష్టపోయి 153 పరుగులు మాత్రమే చేసింది.

మరో 455 పరుగులు వెనుకబడి ఉంది ఇంగ్లాండ్. రెండో ఇన్నింగ్స్ లో ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అటు మహమ్మద్ సిరాజు ఒకటి, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడగొట్టాడు. దీంతో మరో నాలుగు వికెట్లు తీస్తే టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని అంటున్నారు.

ఇక ఇవాళ మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి ఎడ్జ్ బస్టన్ లో భారీ వర్షం పడింది. దీంతో దాదాపు గంటన్నర మ్యాచ్ ఆగిపోయింది. ఈ తరుణంలోనే 10 ఓవర్లను కుడించేశారు అంపైర్లు. అంటే ఇవాళ మొత్తం 80 ఓవర్లు మాత్రమే మ్యాచ్ కొనసాగనుంది. అలా కాదని లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ వర్షం... భారీగా పడితే... టీమిండియా కొంప మునిగినట్లేనని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ENG vs IND : ఐదోరోజు ఆట ప్రారంభం.. కుదించిన ఓవర్లు

Next Story