ENG vs IND : ఐదోరోజు ఆట ప్రారంభం.. కుదించిన ఓవర్లు

by Muthe.Rajitha |

ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న రెండో టెస్టు(2nd Test Match) ఐదవరోజు ఆట వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా మొదలైంది.

ENG vs IND : ఐదోరోజు ఆట ప్రారంభం.. కుదించిన ఓవర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న రెండో టెస్టు(2nd Test Match) ఐదవరోజు ఆట వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా మొదలైంది. అయితే ఈ మ్యాచ్ లో ఓవర్లను కుదించాలని అంపైర్లు నిర్ణయించారు. 10 ఓవర్లు తగ్గించి 80 ఓవర్లకే మ్యాచ్ నిర్వహిస్తున్నారు. దీంతో 72/3 ఓవర్ నైట్ స్కోర్ తో ఇంగ్లండ్ బరిలోకి దిగగా.. క్రీజులోకి దిగిన వెంటనే పోప్(24) ఔట్ అయ్యాడు. ఈ పరిణామం ఇంగ్లండ్ ను మరింత ఒత్తిడిలోకి నెట్టినట్టు కనిపిస్తోంది. మ్యాచ్ గెలవాలి అంటే భారత్ 6 వికెట్లు తీయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ 536 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఆట డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story