IND Vs ENG: ధాటిగా ఆడిన భారత ఓపెనర్లు.. లంచ్ సమయానికి స్కోర్ ఇదే!

by Kema Shiva Kumar |

ఐదు మ్యాచ్‌ల‌ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ (England) మొదట బౌలింగ్ ఎంచుకుంది.

IND Vs ENG: ధాటిగా ఆడిన భారత ఓపెనర్లు.. లంచ్ సమయానికి స్కోర్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచ్‌ల‌ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ (England) మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు ధాటిగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. లంచ్ ముగిసే సమయానికి సాయి సుదర్శన్ (0), యశస్వీ జైస్వాల్ 83 బంతుల్లో 45 పరుగులతో క్రీజ్‌‌లో ఉన్నారు. ఇక కేఎల్ రాహుల్ (46) క్రిస్ వోక్స్ వేసిన ఏడో ఓవర్‌లో ఫోర్ కొట్టి ఇంగ్లాండ్ గడ్డపై టెస్టులలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. అతడి కంటే ముందు ముందు సచిన్ (1,575), ద్రవిడ్ (1,376), గావస్కర్ (1,152), కోహ్లీ (1,096) ఈ ఫీట్ సాధించిన వారిలో ఉన్నారు. అనంతరం కేఎల్ రాహుల్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్‌కు ఒక వికెట్ దక్కింది.

Next Story