IND Vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

by Kema Shiva Kumar |

భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డేలో ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

IND Vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్ జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

Next Story