- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడేజా ఒంటరి పోరాటం.. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే ?
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఒకే ఒక్క వికెట్

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఒకే ఒక్క వికెట్ తీయాల్సి ఉంది. అదే సమయంలో టీమిండియా గెలవాలంటే 30 పరుగులు చేస్తే సరిపోతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ... జడేజా మాత్రం సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం 56 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా... జట్టును గెలిపించేలాగా కనిపిస్తున్నాడు. ఏమాత్రం ఇంగ్లాండు బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా... జట్టును లీడ్ చేస్తున్నాడు.
అటు రెండో ఇన్నింగ్స్ లో 70 ఓవర్లు ఆడిన టీమిండియా... టీ బ్రేక్ సమయానికి 9 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది. మరో 30 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. అటు టీమిండియా చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. రవీంద్ర జడేజాతో పాటు మహమ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి టీ బ్రేక్ తర్వాత... జట్టును జడేజా గెలిపిస్తాడా లేదా అనేది చూడాలి.






