7 వికెట్లు డౌన్...లార్డ్స్ లో టీమిండియా గెలవడం కష్టమేనా!

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన కష్టాల్లో పడింది. సులభంగా మ్యాచ్ గెలుస్తుంది

7 వికెట్లు డౌన్...లార్డ్స్ లో టీమిండియా గెలవడం కష్టమేనా!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన కష్టాల్లో పడింది. సులభంగా మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటే... వరుసగా వికెట్లను కోల్పోతోంది టీమిండియా. ఇవాళ చివరి రోజు 137 పరుగులు చేస్తే విజయం సాధించాల్సి ఉండగా... ఇవాళ మ్యాచ్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు మూడు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ 39 పరుగులకు అవుట్ కాగా, రిషబ్ పంత్ తొమ్మిది పరుగులకు క్లీన్ బోల్డ్ అయ్యాడు. అటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ డక్ అవుట్ అయ్యాడు.

దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 30 ఓవర్లు ఆడిన టీమిండియా.. 7 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. మరో 94 పరుగులు చేస్తేనే ఈ మ్యాచ్ గెలుస్తుంది టీమిండియా. ప్రస్తుతం రవీంద్ర జడేజా అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరిలో ఒక్క వికెట్ పోయిన టీమిండియా గెలవడం కష్టమేనని అంటున్నారు. చేతిలో కేవలం మూడు వికెట్లు ఉన్న నేపథ్యంలో... ఆచితూచి ఆడుతున్నారు ఈ ఇద్దరు ప్లేయర్లు. అటు టీమిండియాను ఆల్ అవుట్ చేసేందుకు.. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story