ఓవల్ టెస్ట్ : గిల్ ఔట్.. జైస్వాల్ సెంచరీ

by Muthe.Rajitha |

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఓవల్ టెస్ట్ : గిల్ ఔట్.. జైస్వాల్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటి రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్(11) ఔట్ కాగా ఓపెనర్ జైస్వాల్(104*) సెంచరీ చేసాడు. అయితే అంతకముందు హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో కనిపించిన ఆకాష్ కూడా ఔట్ అయ్యాడు. గిల్ అనంతరం బ్యాటింగ్ కు దిగిన కరుణ్ కూడా (17) వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం జైస్వాల్, జడేజా క్రీజులో ఉన్నారు. 55 ఓవర్లలో 5 వికెట్లను 234 పరుగులు చేసిన భారత్.. 211 పరుగుల లీడ్ లో ఉంది. భారత్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాగా.. భారత్ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story