India vs England, : బుమ్రా పంచ్.. ఇంగ్లాండ్ ఆలౌట్

by Disha Web Desk 12 |
India vs England, : బుమ్రా పంచ్.. ఇంగ్లాండ్ ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులోని రెండో రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. రెండో రోజు మొదట్లో జైస్వాల్ అద్భుత డబుల్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు అనంతరం బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్.. 396 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు వణికించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వేగవంతమైన బౌన్సర్లు, యార్కర్లతో బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా ఏకంగా ఐదు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ 55.5 ఓవర్లకు 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ 76, బెన్ స్ట్రోక్స్ 47, జానీ బైర్లుథౌ 27, ఒల్లీ పోప్ 23, బెన్ డుక్వెట్ 21, టామ్ హార్టులే 21 పరుగులు చేశారు.పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 6, కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 1 వికెట్లు పడగొట్టారు.

Next Story

Most Viewed