ఇంగ్లాండ్ తో టెస్ట్.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇదే.. మిడిల్ ఆర్డర్ లో గిల్!

by velandi.Saikiran |

ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( england) మధ్య ఐదు టెస్టుల సిరీస్ (Five tests)మరో రెండు రోజుల్లోనే ప్రారంభం కాన

ఇంగ్లాండ్ తో టెస్ట్.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇదే.. మిడిల్ ఆర్డర్ లో గిల్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( england) మధ్య ఐదు టెస్టుల సిరీస్ (Five tests)మరో రెండు రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ టెస్ట్ సిరీస్ పైన పడింది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లాంటి బడా క్రికెటర్లు... లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది.

యంగ్ క్రికెటర్ గిల్ ( Gill) సారాధ్యంలో.... టీమిండియా బరిలోకి దిగుతోంది. దీంట్లో టీమిండియా గెలుస్తుందా? లేదా అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇక జూన్ 20వ తేదీ నుంచి.. తొలి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్ లైన్ అప్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ ఇద్దరు... బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మూడవ స్థానంలో కరుణ్ నాయర్ వస్తారని... వస్తారని చెబుతున్నారు.

ఇక టీమిండియా కెప్టెన్ గిల్ మాత్రం నాలుగో స్థానంలో బరిలో దిగే ఛాన్స్ ఉంది. అలాగే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో అంటే ఐదవ స్థానంలో వచ్చే ఛాన్స్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆరవ స్థానంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివర్లో శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా... దుమ్ము లేపే ఛాన్స్ ఉంది. అయితే ఫైనల్ వరకు వచ్చేసరికి ఈ లైన్ అప్ ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

మొదటి టెస్ట్ కోసం XI అంచనా:

1. జైస్వాల్

2. కల్

3. ఈశ్వరన్/సాయి/నితీష్

4. గిల్

5. పంత్

6. నాయర్

7. జడేజా

8. శార్దూల/కుల్దీప్

9. ప్రసాద్

10. బుమ్రా

11. సిరాజ్



Next Story