- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND Vs BAN: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. 2 పరుగులు 2 వికెట్లు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమేనని కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమేనని కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) అన్నారు. హైబ్రీడ్ మోడల్‌లో భాగంగా దుబాయ్ (Dubai) వేదిక టీమిండియా (Team India) నేడు బంగ్లాదేశ్ (Bangladesh)తో తలపడబోతోంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజాముల్ హుస్సేన్ శాంటో (Nazamul Hussain Santo) బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. ఒకవేళ టాస్ గెలిస్తే తాను బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నట్లుగా తెలిపారు. జట్టులో ప్రతి ఒక్క ప్లేయర్ 100 శాతం ఫిట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో దుబాయ్ (Dubai)లో ఆడిన అనుభవం తమకు ఉందని అన్నారు. లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం కాస్త సులువుగానే ఉంటుందని రోహిత్ శర్మ తెలిపారు.
ఆదిలోనే బంగ్లాకు షాక్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ (Bangladesh)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సౌమ్య సర్కార్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ నజాముల్ హుస్సేన్ శాంటో, హర్షిత్ రాణా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పరుగులు ఏమీ చేయకుండానే పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 3 ఓవర్లలో 2 కీలక వికెట్లు కోల్పోయి 10 పరుగులు చేసింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
బంగ్లాదేశ్ జట్టు: తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.






