IND Vs AUS: నిలకడగా ఆడుతోన్న భారత్.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ

by Kema Shiva Kumar |

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న తొలి టెస్టులో రెండో భారత్ జట్టు (Team India) నిలకడగా ఆడుతోంది.

IND Vs AUS: నిలకడగా ఆడుతోన్న భారత్.. యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న తొలి టెస్టులో రెండో భారత్ జట్టు (Team India) నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్సింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా సెకండ్ ఇన్సింగ్స్‌లో ఆచితూచి ఆడుతోంది. ఈ క్రమంలోనే ఒపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) హాప్ సెంచరీతో అదరగొట్టాడు. అతడు మొత్తం 132 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) 115 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆసిస్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారు. అయితే, పెర్త్ పిచ్ (Perth Pitch) ఇవాళ ఉదయం బౌలర్లకు సహకరించినా.. సెకండ్ సెషన్‌లో పరిస్థితి తారుమారైంది. ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) బౌలర్లను తరచుగా మార్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది. టీ విరామ సమయానికి భారత్ వికెట్లు ఏమి నష్టపోకుండా 104 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ 53 (140), కేఎల్ రాహుల్ 42 (115) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, అంతకు ముందు 67 పరుగులు 7 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభంచిన ఆసిస్ భారత బౌలర్ల ధాటికి మరో 37 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ అలెక్స్ కారీ (Alex Carey) 31 బంతుల్లో 21 పరుగులు, మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 112 బంతుల్లో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 5 వికెట్లు, హర్షిత్ రాణా (Harshith Rana) 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు 2 వికెట్లు దక్కాయి.

Next Story