IND vs AUS: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ లెవన్ నుండి సూర్య ఔట్

by Disha Web Desk 19 |
IND vs AUS: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ లెవన్ నుండి సూర్య ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం రెండవ టెస్ట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రెండవ టెస్ట్‌కు ఆస్ట్రేలియా, భారత్ చెరో మార్పుతో బరిలోకి దిగాయి. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రాగా.. ఆస్ట్రేలియాలో ట్రావిస్ హెడ్ ప్లేయింగ్ లెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ టెస్ట్‌లో గెలిచి భారత్ 1-0 తేడాతో అధిక్యంలో ఉంది.

Next Story

Most Viewed