- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs AUS: హిట్‌మ్యాన్ సూపర్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా టీమిండియా
సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 237 టార్గెట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 237 పరుగుల టార్గెట్ ఇచ్చింది. తొలుత టాస్ గెలిచిన కంగారులు టీమిండియా బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మ్యాట్ రెన్‌షా (56) హాఫ్ సెంచరీ చేశారు. అదేవిధంగా మిచెల్ మార్ష్ (41), మాథ్యూ రెన్‌షా (30), ట్రావీస్ హెడ్ (29) అలెక్స్ క్యారీ (24) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, వాషింగ్టన్ సుందర్ 2, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతర బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడే క్రమంలో 26 బంతుల్లో 24 పరుగులు చేసి హెజిల్‌వుడ్ బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ చక్కని ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. భారీ షాట్లు ఆడుతూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మరో ఎండ్‌లో రెండు మ్యాచ్‌లలో డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లో వచ్చినట్లుగా కనిపిస్తుంది. 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 63 బంతుల్లో 50 పరుగులు, విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 29 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.






