- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు భారీ స్కోర్ వద్ద ఇండియా డిక్లేర్ ప్రకటించింది. న్యూ చండీగఢ్ వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జైస్వాల్ 24 పరుగులకు అవుట్ కాగా.. కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. అలాగే సాయి సుదర్శన్ 81 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 126 పరుగులతో రెచ్చిపోయాడు. అనంతరం పంత్ 81 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే చివరల్లో సుందర్ 52 పరుగులతో అజేయంగా నిలవగా, మానవ్ సుతార్ 28, సిరాజ్ 22 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు రెండో రోజు 127 ఓవర్లకు 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ ప్రకటించింది. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ మహ్మద్ సలీస్ షఫీ ఒక్కడే 6 వికెట్లు తీసుకున్నాడు.






