- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 ప్రపంచ కప్..బోణీ కొట్టిన భారత జట్టు
ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, భారత A జట్ల మధ్య వామప్ మ్యాచ్ జరిగింది. ఇందులో 38 పరుగుల తేడాతో భారత A జట్టు విక్టరీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు భారత జట్టు శుభారంభం అందుకుంది. వార్మప్ మ్యాచ్ లో ( Warm Up) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టును ( United States of America) ఓడించి బోణీ కొట్టింది భారత A జట్టు. దీంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీన అంటే మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, భారత A జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో 38 పరుగుల తేడాతో భారత A జట్టు విక్టరీ కొట్టింది.
38 పరుగుల తేడాతో ఇండియా A విజయం
టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో నవీ ముంబై వేదికగా జరిగిన ఈ వార్మప్ మ్యాచ్ లో ఇండియా A మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో 20 ఓవర్లు ఆడిన భారత జట్టు, కేవలం మూడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడి ఓడింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 19.4 ఓవర్లు ఆడి 200 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో వార్మప్ మ్యాచ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓటమి చవి చూసింది.
ఇది ఇలా ఉండగా, టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో వార్మప్ మ్యాచ్ ఆడిన భారత జట్టు.. మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 4వ తేదీ అంటే ఎల్లుండి దక్షిణాఫ్రికా వర్సెస్ భారత A జట్ల మధ్య మరో మ్యాచ్ ఉండనుంది. ఇక ఇటు నమీబియాతో మూడో వార్మప్ మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన భారత ఏ జట్టు ఆడనుంది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది.






