- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ind-A vs SA-A : శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. తొలి వన్డేలో భారత్ ‘ఏ’ ఘన విజయం
సౌతాఫ్రికా ‘ఏ’తో వన్డే సిరీస్‌ను భారత్ ‘ఏ’ జట్టు ఘనంగా మొదలుపెట్టింది.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా ‘ఏ’తో వన్డే సిరీస్‌ను భారత్ ‘ఏ’ జట్టు ఘనంగా మొదలుపెట్టింది. రాజ్‌కోట్‌లో గురువారం జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్(117) శతకంతో కదం తొక్కి భారత్ ‘ఏ’ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టు ఆరంభంలో తీవ్రంగా తడబడింది. అర్ష్‌దీప్ సింగ్ తోపాటు ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాప్-5 బ్యాటర్లు తేలిపోయారు. అందులో ముగ్గురు డకౌటవ్వడం గమనార్హం. దీంతో దక్షిణాఫ్రికా ‘ఏ’ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత ‘ఏ’ బౌలర్ల జోరు చూస్తుంటే ప్రత్యర్థిని 100లోపే ఆలౌట్ చేసేలా కనిపించారు. కానీ, ఈ పరిస్థితుల్లో సౌతాఫ్రికా ‘ఏ’ను డెలానో పోట్గీటర్(90), డియాన్ ఫొరెస్టెర్(77), ఫోర్టుయిన్(59) జట్టును ఆదుకున్నారు. దీంతో ఆ జట్టు చివరికి 9 వికెట్లు కోల్పోయి 285 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక, ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. దీంతో భారత్‌కు చేజింగ్ పెద్ద కష్టం కాలేదు. దూకుడుగా ఆడిన అతను సఫారీ బౌలర్లను దంచేశాడు. 129 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ(31), కెప్టెన్ తిలక్(39), నితీశ్ కుమార్(37)లతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. సెంచరీ తర్వాత గైక్వాడ్ అవుటైనప్పటికీ నితీశ్, నిశాంత్(29 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. దీంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ ‘ఏ’ 286 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.






