- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో టీ20లో భారత్ ఘోర ఓటమి
19.1 ఓవర్లలో ఆలౌట్ అయింది భారత జట్టు. ఈ క్రమంలో 162 పరుగులు మాత్రమే సాధించిన భారత జట్టు, 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: 5 టీ20ల సిరీస్ లో దక్షిణాఫ్రికా ఖాతా తెరిచింది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా, రెండో మ్యాచ్ లో మాత్రం ఇరగదీసింది. భారత జట్టును అష్టదిగ్బంధనం చేసిన దక్షిణాఫ్రికా బౌలర్లు, తమ జట్టుకు విజయాన్ని అందించారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగంలో అదరగొట్టిన దక్షిణాఫ్రికా, న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత జట్టుపై ఏకంగా 51 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, నాలుగు వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 90 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు బ్యాటర్లు తడబడిపోయారు. తిలక్ వర్మ మినహా టాపర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటట్లు అట్టర్ ప్లాప్ కావడంతో 19.1 ఓవర్లలో ఆలౌట్ అయింది భారత జట్టు. ఈ క్రమంలో 162 పరుగులు మాత్రమే సాధించిన భారత జట్టు, 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్ 1-1 తేడాతో సమం అయింది. ఈ టోర్నమెంట్ లో మరో మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.






