- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australia vs India, 2nd Test : అసీస్ తో రెండో టెస్టు..కష్టాల్లో టీమిండియా.. 90పరుగులకే 5 వికెట్లు

దిశ, వెబ్ డెస్క్ : బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా అస్ట్రేలియా(Australia)తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(second Test)లో భారత్(India) బ్యాటర్లు పరుగుల కోసం చమటోడుస్తున్నారు. 90పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయిన టీమిండియా అసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడుతోంది. పింక్ బాల్ తో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0) డకౌట్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే అసీస్ పేసర్ స్టార్క్ యువ సంచలనం జైస్వాల్ ను ఎల్బీ డబ్ల్యు గా అవుట్ చేసి భారత్ ను గట్టి దెబ్బతీశాడు.
అనంతరం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (37)ను కూడా స్టార్క్ అవుట్ చేశాడు. ఆ వెంటనే స్టార్క్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(7)ని కూడా అవుట్ చేసి వరుసగా మూడు వికెట్లు సాధించి భారత్ ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. శుభమన్ గిల్(31)ని బోలాండ్ ఎల్బీ డబ్ల్యు గా పెవిలియన్ చేర్చాడు. మూడు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు, తొలి సేషన్ లో 82పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టన్ రోహిత్ శర్మ(3) కూడా ఆదుకోకుండానే అవుటయ్యాడు. రోహిత్ ను బోలాండ్ ఎల్భీగా పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం రిషబ్ పంత్(10), నితీష్ కుమార్ రెడ్డి(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.






