మెస్సీ మాయాజాలం.. FIFA World Cup ఫైనల్లో అర్జెంటీనా

by Javid Pasha |
మెస్సీ మాయాజాలం.. FIFA World Cup ఫైనల్లో అర్జెంటీనా
X

దిశ, వెబ్ డెస్క్: ఖతర్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్-2022 లో స్టార్ ఆటగాడు మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా ఫైనల్ కు దూసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత లూసాయిల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో 3-0 తేడాతో క్రొయోషియాను మట్టికరిపించిన అర్జెంటీనా ఘనంగా ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో అడుగు పెట్టింది. దీంతో 6 సార్లు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన జట్టుగా అర్జెంటీనా రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్ లో జులియ్ అల్వరెజ్ 2, మెస్సీ 1 గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. కాగా.. అర్జెంటీనా తన ఫైనల్ మ్యాచ్ ను రెండో సెమీ ఫైనల్ విన్నర్ (ఫ్రాన్స్ లేదా మొరొక్కో) తో ఆడనుంది. ఇక ఫ్రాన్స్, మొరొక్కో జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది.

Also Read....

ఇదే నా చివరి ప్రపంచ కప్.. లియోనెల్ మెస్సీ

Next Story

Most Viewed