- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిఆర్ఎస్ లో.. 'అతని'కి తిరుగులేదు! అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసలు
డిసిషన్ రివ్యూ సిస్టమ్(డిఆర్ఎస్) కు సంబంధించి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి తిరుగు ఉండదు.

దిశ, వెబ్ డెస్క్: డిసిషన్ రివ్యూ సిస్టమ్(డిఆర్ఎస్) కు సంబంధించి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి తిరుగు ఉండదు. ఈ విషయంలో ధోనీ తనకు తానే సాటి. క్రికెట్ మైదానంలో ఫీల్డింగ్ స్థానాలు మార్చాలన్నా, బౌలింగ్ లో మార్పులు చేయాలన్నా అది ధోనీ తర్వాతే ఎవ్వరైనా! ఎందుకంటే ధోనీ రివ్యూ అంత ఖచ్చితంగా ఉంటుంది. ఇదే విషయం అనేక మ్యాచ్ లలో నిరూపితం కూడా అయింది. అయితే తాజాగా డిఆర్ఎస్ కు సంబంధించి మహేంద్ర సింగ్ ధోనీని.. అంపైర్ అనిల్ చౌదరి పొగడ్తలతో ముంచెత్తాడు.
'2 స్లాగర్స్'.. అనే పోడ్ కాస్ట్ లో అంపైర్ అనిల్ మాట్లాడుతూ.. "సాధారణంగా వికెట్ కీపర్లకు స్టంప్ లకు అవతలి వైపు జరిగే సంఘటనలను ట్రాక్ చేసి నిర్ధారించడం కష్టమైన పని. కానీ అది ధోనీ విషయంలో మాత్రం కాదు. ధోనీ డిఆర్ఎస్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. మ్యాచ్ లో అతను తీసుకునే విషయాలు ఖచ్చితత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు అయితే వికెట్ కీపర్లకు బౌలర్ స్థానం అస్సలు కనపడదు. కానీ ఈ విషయంలో మాత్రం ధోనీ నిర్ణయాలు సఫలమవుతాయి" అని అనిల్ చౌదరి అన్నారు.






